
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులు వార్డు సభ్యులు ఉపసర్పంచ్ లు సోమవారం ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అంబేద్కర్ నగర్ సర్పంచిగా ఇమ్మడి దయాకర్, బొత్తలపల్లి సర్పంచిగా భాషబోయిన శ్రీనివాస్, చెల్పూర్ సర్పంచిగా వంతడుపుల కస్తూరి , చిన్న పాపయ్యపల్లి సర్పంచిగా చల్లూరి చిరంజీవి , ధర్మరాజుపల్లి సర్పంచిగా కందాల శ్రీలత, జూపాక సర్పంచిగా తాళ్లపల్లి స్వప్న తాళ్లపల్లి స్వప్న , కందుగుల సర్పంచిగా ముప్పు మహేష్, కనుకులగిద్ద సర్పంచిగా ములుగు సంధ్యారాణి, కాట్రపల్లి సర్పంచిగా పెరుమాళ్ళ హైమ, మాందాడి పల్లి సర్పంచిగా వేల్పుల విజయ, పెద్దపాపయ్యపల్లి సర్పంచిగా కత్తుల రాజు , పోతిరెడ్డిపేట సర్పంచిగా మంతెన సుమలత , రాజపల్లి సర్పంచిగా కట్కూరి మల్లారెడ్డి, రాంపూర్ సర్పంచ్ గా ముషం సంగీత , రంగాపూర్ సర్పంచ్ గా కుంట అరుణ , శాలపల్లి ఇందిరానగర్ సర్పంచిగా కొడిగూటి ప్రవీణ్ , సింగపూర్ గ్రామ సర్పంచ్ గా కలువల సంపత్ , సిర్సపల్లి సర్పంచిగా పోల్సాని రామారావు , తుమ్మనపల్లి సర్పంచ్ గా అన్నాడి మాధవి వెంకట్రావుపల్లి సర్పంచ్ గా పత్తి అనిత లను ప్రత్యేక అధికారులు ఎంపీడీవో తూర్పాటి సునీత, తహసిల్దార్ జక్కని నరేందర్, ఏఈ కావ్య, డిప్యూటీ తహసిల్దార్ వంశీకృష్ణ పలువురు అధికారులు కార్యదర్శులు పాల్గొని ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు వారి మద్దతుదారులతో సంబరాలు జరుపుకున్నారు.





