
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని పీవీ మార్గ్ వద్ద భారతరత్న పీవీ నర్సింహరావు 21వ వర్థంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. PV సాహిత్య పీఠం, పీవీ సేవా సమితి, ఆలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో కమిషనర్ కేంసారపు సమ్మయ్య పాల్గొని పీవి విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ పీవి దేశానికీ అందించిన సేవలను గుర్తుచేశారు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న సమయంలో అనేక ఆర్థిక సంస్కరణాలతో దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించారన్నారు. పీవి ఒక విజన్ గల నాయకుడని, అయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలొ పీవి సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు తూం వెంకట్ రెడ్డి, బి మనోజ్, PV సాహిత్య పీఠం జిల్లా ప్రధాన కార్యదర్శి Dr, విష్ణుదాసు గోపాల్ రావు, జిల్లా ఆర్గనైంగ్ సెక్రటరీ తులసి లక్ష్మణమూర్తి, చందుపట్ల జనార్దన్, సందెల వెంకన్న, కే సదానందం, సాగి వీరభద్రరావు, చిలకమారి శ్రీనివాస్, కొండ గణేష్, మాజీ సర్పంచ్ పంజాల సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు వెంకట్రాజం, ప్రభాకర్, సదానందం, సురేష్, అంబరీష్, నారాయణ, ఎండి ఖలీదు హుస్సేన్ , శ్రీనివాస్ తదితర, ఉప్పు శ్రీనివాస్, వేల్పుల ప్రభాకర్, కొండ గణేష్, ఎస్.కె జలీల్, రావుల తిరుపతిరెడ్డి, బెజ్జుగం ఇంద్రకరణ్, పందిళ్ళ విజయేందర్, మాగంటి శ్రీధర్, గట్టు మహదేవ్, గాజుల చారుదత్త, బీమోజు సదానందం,పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, BC ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, సాగి వీర భద్రరావు, వెంకట రాజం, వేణుమాధవ్, శ్రీనివాస్, తాటిపెల్లి రాజన్న, ఇందుర్తి నరేష్, రమేష్, శ్రీధర్, కాసర్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.









