
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ వన్నాల శివాజీ మరియు గౌరవ అధ్యక్షులు కందుగుల గ్రామ ఉపసర్పంచ్ మండ సతీష్ గౌడ్ ఎన్నికైనట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. అలాగే ఉపాధ్యక్షుడిగా శనిగరపు ఐలయ్య (రాజపల్లి), ప్రధాన కార్యదర్శిగా గీసిడిశైలజ మహేందర్ రెడ్డి(చిన్న పాపయ్యపల్లి), కోశాధికారిగా బండి రాజగౌడ్(పెద్ద పాపయ్యపల్లి), సభ్యులుగా బండి నరేష్ యాదవ్ (రంగాపూర్), ఆవుల రాజ్ కుమార్ (ధర్మరాజుపల్లి), ఇప్పలపల్లి రామకృష్ణ (అంబేద్కర్ నగర్), జనగామ రాజేశ్వరరావు(సిర్సపల్లి), బొల్లవేణి అజయ్ (పోతిరెడ్డి పేట), గిన్నారపు మహేందర్ (జూపాక)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉప సర్పంచ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో పరిష్కరించేదిగా కృషి చేస్తామన్నారు. చెక్ పవర్ విషయంలో సర్పంచ్లతో పాటు ఉపసర్పంచ్ లకు అవకాశం కల్పించినందున ఉపసర్పంచ్లు ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ ల కార్యవర్గానికి పలువురు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు అభినందనలు తెలిపారు.

హుజురాబాద్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైన రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ వన్నాల శివాజీ

ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శనిగరపు ఐలయ్య (రాజపల్లి)..

ఉప సర్పంచ్ల ఫోరమ్ గా ఏర్పడీ సంతకాలు చేసిన ఉపసర్పంచ్లు..

హుజురాబాద్ ఉపసర్పంచుల ఫోరం నాయకులు





