
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంప్ ఆవరణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) కార్యాలయంలో, బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్. రావు తెలిపారు.

డాక్టర్ బిఎన్. రావు మాట్లాడుతూ.. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, ఆర్థిక స్వావలంబనలో ముందడుగు వేయడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ జీవితాలను మార్చుకోవాలని, తమ కాళ్లపై నిలబడేలా ప్రయత్నించాలని సూచించారు. శిక్షణతో పాటు పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలను పెంపొందిస్తామని పేర్కొన్నారు.

ముఖ్య అతిథి కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ..“మహిళల సాధికారత మరియు ఆర్థిక స్వావలంబన కోసం ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు అత్యంత అవసరం అన్నారు. మహిళలు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి, తాము మరియు కుటుంబం కోసం సంపూర్ణ స్వయం ఉపాధి సాధించగలగాలి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. NAC మరియు బిఎన్. రావు హెల్త్ ఫౌండేషన్ కలిసి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం.”అని అన్నారు.
NAC అసిస్టెంట్ డైరెక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ..
“NAC ప్రధాన లక్ష్యం నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. బిఎన్. రావు హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి మహిళల కోసం ఇలాంటి శిక్షణలు నిర్వహించడం ఎంతో గర్వకారణం అన్నారు. శిక్షణ పొందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలి.”అని సూచించారు.
బుధవారం కేసీ క్యాంప్‌లోని NAC ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో NAC సిబ్బంది సబిత, అధం తదితరులు పాల్గొన్నారు.






