Oplus_16908288
– ప్రజారోగ్య పరిరక్షణలో గ్రామ సర్పంచ్లు పాలకవర్గం క్రియాశీలక పాత్ర పోషించాలి..కూరపాటి హాస్పిటల్స్ అధినేత డా. కూరపాటి రమేష్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు మరియు వార్డ్ మెంబర్లను కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్స్ అధినేత డా. కూరపాటి రమేష్ మరియు డా. కూరపాటి రాధిక లు ఘనంగా సన్మానించారు. గురువారం పట్టణంలో ఆభినందన సభను ఘనంగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులను సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డా. కూరపాటి రమేష్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు మరియు సేవా రంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు గ్రామస్థాయిలో విస్తరించేందుకు కూరపాటి ఫౌండేషన్ మరియు కూరపాటి హాస్పిటల్స్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఇటీవల మండలంలోని వివిధ గ్రామాల్లో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచ్లకు సన్మానం చేస్తున్న డాక్టర్స్ కూరపాటి రమేష్ – రాధికలు..





