
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: జమ్మికుంట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సోమవారం హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జమ్మికుంటకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సురంజన్, ప్రముఖుడు ఒగ్గు రమేష్ లకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వo చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ నాయకులు ఉన్నారు

ప్రముఖ వ్యాపారి ఒగ్గు రమేష్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రణవ్ బాబు..

ప్రముఖ వైద్యుడు డాక్టర్ సురంజన్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పార్టీ ఇంచార్జి ప్రణవ్ బాబు





