
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో గల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ధ్వజారోహణ కార్యక్రమం సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు కొడమగుళ్ళ నందకిషోరాచార్యులు ఆలయంలో స్వామివారికి బేరి పూజ, దేవత ప్రబోధకి, అగ్ని ప్రతిష్ట, హవనములను నిర్వహించారు.
– నేడు పద్మావతి వెంకటేశ్వరస్వామి కళ్యాణం
శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామికల్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని వేద పండితులు నందకిషోరాచార్యులు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ కమిటీ చేసినట్లు సత్తయ్య, సురేందర్ తెలిపారు.

కేసి క్యాంపులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం

హోమం నిర్వహించి ద్వజారోహణ కార్యక్రమం ప్రారంభిస్తున్న పూజారులు





