Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి, అంతర్గాం(కరీంనగర్), జనవరి, 20: రాష్ట్రంలోని గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(డబ్ల్యుజేఐ ) పనిచేస్తున్నదని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం, రామగుండం మండలాల ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం కరీంనగర్ లో డబ్ల్యూజెఐ నేతలను కలిశారు. ఇప్పటివరకు కొనసాగుతున్న తమ ప్రెస్ క్లబ్ లను డబ్ల్యూజేఐ అనుబంధంగా నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేయగా డబ్ల్యూజేఐ నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ, సమాజాన్ని చైతన్య పరచడంలో జర్నలిస్టులు, విద్యావేత్తల పాత్ర కీలకమన్నారు. డబ్ల్యూజేఐ కృషి వల్ల ప్రింట్ మీడియాతోపాటు టెలివిజన్, రేడియో, డిజిటల్ మీడియాల్లో పనిచేసే జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, కార్మిక భద్రతా పరిధిలోకి వచ్చారన్నారు. తమ యూనియన్ దీర్ఘకాలిక పోరాటం వల్లనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని, దీనివల్ల ప్రింట్ జర్నలిస్టులతో సమానంగా డిజిటల్ మీడియా, టెలివిజన్, రేడియో జర్నలిస్టులూ అనేక ప్రయోజనాలు పొందనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల్లో ఐక్యత లోపించడం వల్లనే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. డబ్ల్యూజేఐ నాయకులను కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు పంజాల రాధాస్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శి సందూరి చంద్రమౌళి, సంయుక్త కార్యదర్శి కాంపెల్లి మల్లిఖార్జున స్వామి, కోశాధికారి నగునూరి రాజయ్యగౌడ్ లు ఉన్నారు.

డబ్ల్యూజేఐ నాయకులకు వినతి పత్రాన్ని అందజేస్తున్న వివిధ క్లబ్బుల నిర్వాహకులు..





