
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రిపబ్లిక్ డే వేడుకలు సోమవారం హుజురాబాద్ డివిజన్లోని హుజురాబాద్ జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో గ్రామ గ్రామాన మువ్వన్నెల జెండా ఎగరేసి సంతోషంగా జరుపుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వివిధ పార్టీ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలు విద్యాసంస్థల విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు భారత్ మాతాకీ జై అంటూ పట్టణ పురవీధుల గుండా ప్రభాత్ భేరి చేశారు. అనంతరం జాతీయ పతాక ఎగరవేసి వందనం చేశారు. మిఠాయిలు పంచిపెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. హుజురాబాద్ కెసి క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీవో రమేష్ బాబు, ఏసీపీ కార్యాలయంలో ఏసీబీ వాసంశెట్టి మాధవి, రవాణా శాఖ కార్యాలయంలో ఎంవిఐ కంచి వేణు, రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, కోర్టు కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జ్ పిబి కిరణ్ కుమార్, తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జక్కుల నరేందర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సునీత, సర్కిల్ కార్యాలయంలో టౌన్ సిఐ టీ కరుణాకర్, ఏరియా ఆసుపత్రిలో సూపరిండెంట్ డాక్టర్ నారాయణరెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓ బి శ్రీనివాస్, కార్మిక శాఖ కార్యాలయంలో ఎల్ వో చందన, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, కిట్స్ కాలేజీలో ప్రిన్సిపల్ డాక్టర్ శంకర్, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆంజనేయరావు, సింగిల్ విండో కార్యాలయంలో సీఈఓ వివేక్, కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, డీసీఎంఎస్ కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు, హై స్కూల్ క్రీడామైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కే హరిప్రసాద్ జండా ఆవిష్కరించారు. వివిధ కార్మిక సంఘాలు కుల సంఘాలు వారి వారి కార్యాలయాల ముందు జాతీయ పతాకాలను ఎగురవేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జండా ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జండా ఆవిష్కరించి నమస్కరిస్తున్న పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు..

హుజురాబాద్ క్లబ్బులో…

సింగపూర్ కిట్స్ లో జండా ఆవిష్కరించి మాట్లాడుతున్న ప్రిన్సిపల్ శంకర్ బాబు….

ఏరియా ఆసుపత్రిలో సూపరిండెంట్ నారాయణరెడ్డి జెండా ఆవిష్కరిస్తూ…

హుజురాబాద్ వాకర్స్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ….


నాయి బ్రాహ్మణ సంఘం భవనం వద్ద…

హుజురాబాద్ సోడా అసోసియేషన్ కార్యాలయం వద్ద…

అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఫోర్స్ పాఠశాల విద్యార్థుల విన్యాసాలు…

డీసీఎంఎస్ కాంప్లెక్స్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో జండా ఆవిష్కరిస్తున్న అధ్యక్షుడు రాజు…





