
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని మామిండ్లవాడలోని 17వ వార్డులో బుధవారం పారిశుధ్య పనులు నిర్వహించినట్లు 17వ వార్డు కౌన్సిలర్ ఎండి ఖాళీక్ హుస్సేన్ అన్నారు. 17వ వార్డులోని పలు వీధుల్లో రోడ్డు పక్కన ఉన్న చెత్త పిచ్చి చెట్లను జెసిబి సహాయంతో తొలగించి శుభ్రం చేయించినట్లు ఆయన తెలిపారు. జమ్మికుంట రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్, సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, ఎన్విరాన్మెంట్ అధికారి వినయ్ తదితరులు పరిశీలించారు.

మామిళ్ల వాడలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న స్థానిక కౌన్సిలర్ ఖలీద్ హుస్సేన్..





