Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నేషనల్ లైన్ మెన్స్ డే ను పురస్కరించుకొని బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న లైన్ మెన్ రాజిరెడ్డిని ట్రాన్స్కో డి.ఈ.ఈ లక్ష్మారెడ్డి ప్రశంసా పత్రం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ట్రాన్స్కో శాఖలో ఉత్తమ సేవ లందిస్తున్నందుకు గాను రాజిరెడ్డిని సత్కరించినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా ఉద్యోగులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తే గుర్తింపు తానంతట అదే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో రూరల్ ఏఈ రమేష్, పలువురు ఉద్యోగులు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ట్రాన్స్ కో ఉద్యోగి రాజిరెడ్డినీ సన్మానిస్తున్న డిఈఈ లక్ష్మారెడ్డి, రూరల్ ఏఇ రమేష్ తదితరులు..





