
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాబోయే విద్యా సంవత్సరానికి క్రీడా పాఠశాలకు అర్హులైన విద్యార్థులను క్రీడలను నిర్వహించి విజేతలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో హుజురాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వివిధ అంశాల్లో క్రీడల నిర్వహించి జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సమ్మిరెడ్డి, హెచ్ఎం డిఎం శోభారాణి, ఎస్జిఎఫ్ కార్యదర్శి చిరుత శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్లు రేణుక, పి రాజు, టీ భాగ్యలక్ష్మి, సిఆర్పి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రీడా పాఠశాలకు విద్యార్థుల యొక్క చేస్తున్న అధికారులు..

ఎంపికైన విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంఈఓ విడపు శ్రీనివాస్..





