
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి(ఇల్లందకుంట): తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు ప్రభుత్వ విప్ రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డివానిపల్లి సర్పంచ్ గడ్డి శ్రీనివాస్, వంగ రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఉన్నతమైన పదవులు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని కష్టకాలంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు వెంకట్ అన్నకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని కోరారు. మండలంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషర్మెంట్ చైర్మన్ కరీంనగర్ జిల్లా బండి మల్లేష్, మండల సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ, సర్పంచ్ గడ్డి శ్రీనివాస్, ఉప సర్పంచ్అరెల్లి రమేష్, గుండారపు సాయికుమార్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మంకు ఐలయ్య, ధంసాని కిరణ్
పెద్ది అభి, జక్కు కుమార్, పరకాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.



పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..





