
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఈద్గాలో చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని సందర్శించి పరిశీలించారు. రంజాన్ పండుగ రోజు ప్రార్థన చేసుకునేవారికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని సిబ్బందికి సూచించారు. చైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మదులను జామే మసీద్ అండ్ ఈద్గా కబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, జామే మస్జిద్ ఈద్గా & ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ఎండి ముజాహిద్ హుస్సేన్, మేనేజర్ ఆర్.భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి.కిరణ్, సభ్యులు మహమ్మద్ ఫయజుద్దీన్, రియాసత్ అలీ, జవాన్ ఆర్ సుధీర్, ముస్లిం నాయకులు ఉల్ఫాత్, అబిద్ తదితరులు పాల్గొన్నారు.


ఈద్గాలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ ముసబ్ అహ్మద్

చైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ ముసబ్ అహ్మద్ లను సత్కరిస్తున్న కమిటీ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్..




