
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 14 సంవత్సరాలు నిండిన బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు రూపొందించిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హెచ్ పి వి వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమంది వ్యాక్సిన్ వేసుకున్నారు, ఇంకా ఎంతమంది వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంది అన్న విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని అడిగి తెలుసుకొని రిజిస్టర్ లను పరిశీలించారు.14 సంవత్సరములు నిండిన బాలికలను వ్యాక్సిన్ సెంటర్ కి తరలించి హెచ్ పి వి టీకా తీసుకునేటట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. స్కూళ్లలో 14 సంవత్సరాల నిండిన బాలికలను హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసుకునేటట్లు మోటివేట్ చేయాలని వారిలో ఉన్న అపోహలను తొలగించాలని కోరారు.

—చెల్పూర్ పిహెచ్సి తనిఖీ:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ
హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ కోల్డ్‌చైన్ స్టేటస్‌ను లేబర్ రూమ్‌ను మందుల స్టోర్ రూమ్‌ను సందర్శించారు. నార్మల్ డెలివరీ లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిపేటట్లు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, సిహెచ్ఓ సదానందం, డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, హెచ్ ఈఓ విజయేందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని అడిగి తెలుసుకొని రిజిస్టర్ లను పరిశీలిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ




