
–హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఈటల జన్మదిన వేడుకలు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మార్చి 20: హుజురాబాద్ లో మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు తెలంగాణ పెరిక క్షత్రియ కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకతి శ్రీనివాస్ (వాసు) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి టపాసులు పేలిచి అన్నదానం చేశారు. ఈటల రాజేందర్ నిండా నూరేళ్లు జీవించి ప్రజా జీవితంలో మరింత ఎత్తుకు ఎదిగి, ఉన్నత సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి రాజు, నల్ల సుమన్, పోతుల సంజీవ్, ఒడ్నాల విజయ్, యాళ్ల సంజీవరెడ్డి, గంట సంపత్, బీమోజు వెంకట్, ఆవుల సదయ్య, యాట రాజేష్ కన్నా, బెజ్జంకి రవీందర్, బోరగాల సారయ్య, సబ్బని రమేష్, అనిశెట్టి శివ, చింటూ, రాజ్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఎంపీ జన్మదిన కేక్ కట్ చేసి నాయకుడు సుమన్ కు తినిపిస్తున్న అంకతి శ్రీనివాస్..

ఈటెల జన్మదినం సందర్భంగా బిర్యానీ పొట్లాలు పంచుతున్న అంకతి శ్రీనివాస్, బిజెపి నాయకులు..


నిరుపేదలు, అభాగ్యులకు బిర్యానీ పొట్లాలు అందజేస్తున్న అంకతి శ్రీనివాస్, బిజెపి నాయకులు..




