
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని ఏసీ క్యాంపులో గల ఏవియస్ కన్వెన్షన్ భక్తుల శ్రీరామ నామాలతో జరిగిన రామకోటి యజ్ఞం భక్తి పరవశంతో ఘనంగా జరిగింది. ఈ రామకోటి యజ్ఞంలో వందలాది మంది మహిళలు పురుషులు హాజరై రామనామ జపాన్ని చేశారు. రామకోటి యజ్ఞం అనంతరం భక్తులకు రామచంద్రుని కుంకుమ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి డాన్స్ మాస్టర్ శ్వేత, ఏవియస్ కన్వెన్షన్ సభ్యులు గందె శ్రీనివాస్, సుద్దాల హారిశంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, బల్లు పున్నం, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య నాయకులు నార్ల రాజేందర్, ఎస్ఆర్పీ శివనాథుని వేణుగోపాల్, కటుకం మారుతి, శివనాథుని శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రామకోటి యజ్ఞంలో పాల్గొన్న వందలాది మంది మహిళలు, పురుషులు..





