
—– ఆల్ఫోర్స్ అధినేత డా. వి.నరేందర్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చి 23: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో విద్యా సంవత్సరం ముగింపు అన్యూవల్ డే వేడుకలు సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు, ఉత్తమ విద్యార్థులకు ఆల్ఫోర్స్ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా అన్యువల్ డే వేడుకలను సమ్మాన్ పేరుతో ఘనంగా నిర్వహించామని తెలుపుతూ హుజురాబాద్ పట్టణం పట్టణాలతో పోలిస్తే ఇక్కడ కూడా మంచి విద్యా అవకాశాలను పిల్లలకి ఇవ్వాలని నిశ్చయించి హుజురాబాద్ బ్రాంచ్ పెట్టిన రెండవ సంవత్సరంలోనే అన్ని తరగతులు నిండేలా అడ్మిషన్స్ సాధించామని తెలిపారు. దీనికి తల్లిదండ్రులకు తమ అల్ఫోర్స్ విద్యాసంస్థల పైన ఉన్న మంచి నమ్మకమేనని, తల్లిదండ్రుల నమ్మకాన్ని తగ్గట్టుగా వచ్చే సంవత్సరం విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. అలాగే తమ ఆల్ఫోర్స్ విద్యార్థులు ఎక్కడ చదివినా మంచి మార్కులు సాధించి ఐఐటి, ఎన్ఐటి లు సాధిస్తున్నారని తెలిపారు. తదనంతరం హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని మాట్లాడుతూ, తను కూడా ఒకప్పుడు ఆల్ఫోర్స్ విద్యార్థిని అని, తను చదువుకున్న విద్య సంస్థకు ముఖ్యఅతిథిగా రావడం తనకు గర్వకారణంగా ఉందని, విద్యార్థులు మరింత కష్టపడి చదివినప్పుడే మంచి మార్కులు సాధించి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల అకాడమిక్, క్రీడా సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలను ఏఐ ప్రజెంటేషన్ ద్వారా తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..


అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు..




చిన్నారులకు జ్ఞాపికలు అందజేస్తున్న సుహాసిని, నరేందర్ రెడ్డి..


మాట్లాడుతున్న ఆల్ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి..


మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..

చైర్ పర్సన్ కి జ్ఞాపికను అందజేస్తున్న నరేందర్ రెడ్డి..






