
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత, తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్ సామాజిక సేవలు రచనలు వారి ఆధ్యాత్మిక సేవలను … తెలుగు వెలుగు సాహితీ వేదిక, మరియు తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ పలు సంస్థల వ్యవస్థాపకులు పోలోజు రాజకుమార్ సత్యంగౌడ్ సేవలను గుర్తించి, వీరిని అంతర్జాతీయస్థాయి ఆధ్యాత్మిక విజ్ఞానజ్యోతి అవార్డుకు ఎంపిక చేసి అందజేశారు. ఈ అవార్డును కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో ఆ సంస్థల వ్యవస్థాపకులు పోలోజు రాజకుమార్ తో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వచ్చిన విశ్వ కళ విరాట్ డాక్టర్ వంగల శాంతి కృష్ణచార్య ప్రపంచ వరల్డ్ రికార్డు అవార్డు గ్రహీత, ప్రముఖ హాస్య నటులు ఆర్ఎస్ నంద, సామాజికవేత్త మల్లికార్జున్, సాజనాటి గుంటుక రాధిక, ప్రముఖ న్యాయవాది ఏ కిరణ్ కుమార్, సామాజిక సేవకులు ఎడిటర్ కరీంనగర్ భూమి తెలుగు దినపత్రిక బిడ్డల ప్రశాంత్, ప్రముఖ కవి రచయిత వైరాగ్యం ప్రభాకర్, వివిధ సంస్థల వ్యవస్థాపకులు వలబోజు మోహన్ రావు, పాడిశెట్టి విష్ణువర్ధన్, అడ్డంకి నాగరాజు, సకల కళారత్న అక్కనపల్లి యాదగిరిగౌడ్ తదితర ప్రముఖులు సత్యంగౌడ్ కు పట్టుశాలువ కప్పి, మెడల్ ధరింపజేసి ఉగాది జ్ఞాపికను అందజేసి, జాతీయస్థాయి ఆధ్యాత్మిక విజ్ఞానజ్యోతి అవార్డును ప్రధానం చేసి, ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిలు మాట్లాడుతూ… సత్యంగౌడ్ ఆధ్యాత్మిక సేవలు, వారి రచనలు సామాజిక సేవలు, వెలకట్టని విలువలన్నారు. ఇంతటి అపార జ్ఞానం కలిగిన సత్యంగౌడ్ దైవాంశ సంభూతులన్నారు. ఇంతటి ఆధ్యాత్మికంగా మనం ఏర్పరచుకున్న విలువలపై అనార్కళంగా మాట్లాడే శక్తి కలిగిన సత్యంగౌడ్ సమాజానికి ఎంతో ఉపయోగపడటం అభినందనీయం అన్నారు.


అనంతరం ప్రజా కవి సత్యంగౌడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మనసును అదుపులో పెట్టుకొని, మనసు నిర్మలం పరుచుకొని ప్రశాంతంగా బతకాలి అన్నారు. ఎందరో కళాకారులను, ఆర్టిస్టులను, నృత్య కళాకారులను, కవులను రచయితలను సామాజిక వేత్తలను ప్రోత్సహిస్తూ వారిని ఆదరిస్తూ వారిలో ఉన్న ప్రతిభను బయటికి తీసి ఎందరికో వారి సంస్థల పక్షాన అవార్డులు రివార్డులు సత్కారాలు అందజేసి తనదైన శైలిలో పోలోజు రాజ్ కుమార్ చేస్తున్న వారి సేవలు అపారమన్నారు. మనుషులు ఒకరికి ఒకరు నష్టం చేసుకోకుండా మనిషి మనిషికి సహకరించే దృక్పధాన్ని అలవర్చుకొని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. మనిషి జన్మలో మనిషికి మహోన్నతమైన మంచి మనసు ఉంటుందని, ఆ మనసును సత్ప్రయోజనాలకు, సేవా భావాలకు ఆదర్శప్రాయంగా మెదులుతూ, మనం ఏర్పరచుకున్న మంచి మానవత్వాన్ని కాపాడుకుంటూ, ఆదర్శవంతంగా జీవించలనున్నారు. సమాజానికి, దేశానికి మూల స్తంభాలాంటి వారు నేటి యువత, విద్యార్థులేనని, ఇందుకు ప్రతి విద్యార్థి ప్రయోజకుడుగా ఎదిగి నవ సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలన్నారు. విద్యార్థులు యువత చెడు వేసినాలకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడుతూ, సమాజ సేవలో భాగస్వాములు కావాలని సత్యంగౌడ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు అంటరాని స్వార్ధాన్ని వదులుకొని లోక కళ్యాణంలో భాగస్వాములు కావాలని సత్యంగౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల వ్యవస్థాపకులు, సామాజిక వేత్తలు, గురువులు, కళాకారులు, కవులు రచయితలు, డాన్స్ మాస్టర్లు, టీవీ సీరియల్ ఆర్టిస్టులు, నటులు, నృత్య కళాకారులు, పేరెంట్స్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రజాకవి తత్వవేత్త విశ్వగురు నాగుల సత్యం గౌడ్..





