
–హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (హైదరాబాద్): అన్న దాతలకు, విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య ధోరణి విడనాడాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. అన్నధాతలుకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఓసిల కార్పొరేషన్ లకు పాలక మండల్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో లక్షలాది మందితో ఏప్రిల్ 28న రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలాడి రామారావు హైదారాబాద్ లో సోమవారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి మహాగర్జన సభ ఏర్పాట్ల గురించి కవితకు వివరించి సభకు ఆహ్వానిస్తూ రామారావు ఆహ్వాన పత్రం అందజేశారు.

సభకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తాను స్వయంగా సభకు హాజరవుతానని కవిత ప్రకటించి రైతు మహాగర్జన సమర భేరి సభ గోడ ప్రతులను రామారావుతో కలిసి కవిత ఆవిష్కరించారు. సానుకూలంగా స్పందించి మద్దతు ప్రకటించిన కవితకు ప్రజా సంఘాల సమాఖ్య తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రామారావు ప్రకటించారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే సిఎం రేవంత్ సర్కార్ అన్నదాతల సంక్షేమంపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 70 శాతం మిగిలి ఉన్న రెండులక్షల రుణ మాఫీకి నిధుల కేటాయింపు చేయలేదని, బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిదుల కేటాయింపులు తగ్గించిన ప్రభుత్వం, కౌలు రైతులకు ఇచ్చిన హామీల ఊసే లేదని , అన్ని రకాల పంటలకు 500 రూ బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు అడపా దడపా అర కోరగా ఇస్తూ మోసాగించిందన్నారు.
ఇప్పటికే రెండుసార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం నామ మాత్రంగానే విడుదల చేసి రైతులను దేహీ అనే విధంగా హీనంగా పరిగణించే సర్కార్ కు రైతన్నల ఉసురు తగలక తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిడుదల విడుదల చేయడం లేదని అన్నారు. నామ మాత్రంగానే ఓసి రెడ్డి కార్పొరేషన్ లను ప్రకటించిన ప్రభుత్వం పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదని బడ్జెట్ లో లో నిదుల కేటాయించక రెడ్డి ఓసి లను మోసగించిందన్నారు.
50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతులకు అన్ని విభాగాల్లో 20 లక్షల ఉచిత వైద్య సౌకర్యం ఏర్పాటుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకంతో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని, రైతుకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే రైతుల భాగస్వామ్యం ఉండే రైతు చట్టం తేవాలనే తదితర డిమాండ్ల సాధనకు, అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అన్నీ వర్గాల కుల సంఘాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28న ఓసి జేఏసీ రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్షలాది మంది తో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను న భూతో న భవిష్యత్ తరహాలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని పార్టీల కతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్నామని శరవేగంగా సన్నాహక ఏర్పాట్లు జరుగుతున్నాయని పోలాడి రామారావు తెలిపారు.

కరీంనగర్ లో లక్షలాది మందితో ఏప్రిల్ 28న రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కవిత





