Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం సమయానుకూలంగా నేర్చుకున్న విద్యార్థి సులభముగా విజయం సాధించగలడని జేఎన్టీయూ జగిత్యాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే .శ్రీనివాస్ అన్నారు. ఈరోజు కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్ అధ్యక్షతన జరిగిన ఉత్సవము ప్రారంభోత్సవములో కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కే .శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి సమాజంలో వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని అన్నారు. కొత్త కొత్త సాంకేతిక విషయాలను నేర్చుకున్న వారు మాత్రమే విజయం సాధిస్తారని అన్నారు. సమాజంలో రోజురోజుకు కొత్త కొత్త సాంకేతిక విషయాలు వస్తున్నాయని మనిషి యొక్క జీవన విధానాన్ని సులభతరం చేయుచున్నాయని అన్నారు. పాఠ్య ప్రణాళిక ప్రకారం మాత్రమే చదువుకోకుండా మార్కెట్లోకి వస్తున్న కొత్త పరికరాల గురించి నేర్చుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక శాస్త్రీయ ప్రయోగాలు చేసేందుకు కళాశాలలో ఐడియా ల్యాబ్ ప్రారంభించామని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. వివిధ పోటీలలో పాల్గొనడం ద్వారా విద్యార్థికి న్యాయకత్వ లక్షణాలు వస్తాయని డాక్టర్ శంకర్ అన్నారు. ప్రముఖ చేతి వ్రాత విశ్లేషకుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ మంచి మార్కులు వస్తాయని అన్నారు. చేతి వ్రాతను బట్టి విద్యార్థి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చునని సత్య ప్రకాష్ అన్నారు. సత్య ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ పోటీలలో పాల్గొనడం వలన, వివిధ ప్రాంతాలను సందర్శించడం వలన, వివిధ వ్యక్తులతో చర్చించడం వలన మానసిక సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. కళాశాల రిజిస్టార్ డాక్టర్ వి. రాజేశ్వరరావు మాట్లాడుతూ శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం వలన విద్యార్థికి న్యాయకత్వ లక్షణాలు వస్తాయని అన్నారు. ఉద్యోగ సాధన సులభం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. వేణుగోపాల్, కార్యవర్గ సమన్వయకర్త రాకేష్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





