
–శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
–ముఖ్యఅతిథిగా హుజురాబాద్ పట్టణ సిఐ టీ. కరుణాకర్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఏప్రిల్ 1: ప్రతి మనిషి తన జీవన శైలిలో వ్యాయామం అలవాటు చేసుకోవాలని హుజూరాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ అన్నారు. బుధవారం అంబేద్కర్ చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటి జీవన విధానంలో శారీరక వ్యాయామం రోజుకు ఒక గంట సమయం చేయాలని అన్నారు. వ్యాయామంతో శారీరకంగా ఫిట్టుగా ఉండడంతో పాటు మానసిక ఆందోళనలు కూడా దూరం అవుతాయని అన్నారు. వ్యాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిమ్ యజమాని దాసరి రవి, పడారి కొమురయ్య, దాసరి రాజమౌళితో పాటు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

నూతన హనుమాన్ జిమ్ ప్రారంభిస్తున్న సిఐ కరుణాకర్

జిమ్ చేస్తున్న సీఐ కరుణాకర్





