
– తన పోరాటం వ్యక్తి గతం ..తెలంగాణ వ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీకి నష్టం… బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ యంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి తను బిఆర్ఎస్ పార్టీకి వచ్చి యంఎల్ సి గా అప్పటి తెలంగాణ రాష్ట్ర విప్పుగా పనిచేసిన కాలంనుండి నేటివరకు బిఆర్ ఎస్ పార్టీకి నష్టం కలిగించే పనులే చేసాడు కానీ ఒక్క పనికుడా పార్టీకి పనికొచ్చేది చేయలేదని తను పదవిలోకొచ్చాక ఇక్కడి ప్రజలను కులాల వారిగా మతాల వారిగా దూషిస్తూ కార్యకర్తల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఇటు పార్టీకి అటు పార్టీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ కెసియర్ కి కెటి ఆర్ కి చెడ్డపేరు తేవడమే కాక హుజురాబాద్ ప్రాంతంలో బిఆర్ ఎస్ పార్టీని బలహీన పరుస్తున్నడని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ అన్నారు.


ఈ సందర్భంగా హుజురాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకులతో చేతులు కలిపి మనుకోటలో ఉద్యమకారులపై రాళ్ళదాడి చేసి ఆతర్వాత దొడ్డి దారిన టిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుని ఇప్పుడు పార్టీలోని ఉద్యమకారులను పట్టుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకొని పనిచేయాలని లేదంటే బిఆర్ ఎస్ పార్టీలో ఉంటే ఉండండి లేపోతే పీకేయండి అని దురుసు పదజాలంతో మాట్లాడే స్థితికి వచ్చాడని ఆయన తెలిపారు. యంఎల్ ఏ కౌశిక్ రెడ్డి పార్టీ ముసుగులో తన సొంత ఏజండాలు అమలుచేసుకుంటు పోలీస్ కేసుల్లో ఇరికిస్తూ ఇక్కడి సీనియర్ బిఆర్ ఎస్ నాయకుల భవిషత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాడని అందుకే ఇక్కడి నాయకులు తనకు సహకరించకూడదనే స్థితిలో ఉన్నారు అని సమ్మయ్య స్పష్టం చేసారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు చొరవ తీసుకొంటే తప్ప సద్దుమనగని పరిస్థితులు హుజురాబాద్ బిఆర్ ఎస్ లో ఉన్నాయని లేకుంటే ముందు ముందు యంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి వింత పోకడలతోఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలహీన పడే అవకాశం ఉందని సమ్మయ్య ఆవేదన వ్యక్తంచేశారు.






