
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బహుజన నాయకుడు, రజాకార్లను ఎదిరించిన సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316 వర్ధంతి వేడుకలు హుజురాబాద్ లో బీసీ ఆజాది ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతిగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంతో పాటు రజాకార్ల నుండి స్వరాష్ట్ర సాధన కోసం భూస్వాముల హక్కుల కోసం తిరగబడ్డ బహుజన బిడ్డగా సర్వాయి పాపన్న చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ గుర్తు చేశారు. బహుజన బిడ్డ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన బీసీ ఆజాద్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భీమగోని సురేష్ గౌడ్, చిత్తంపూడి నాగరాజుగౌడ్, ఇల్లందుల తిరుపతి, కందుకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నినాదాలు చేస్తున్న బీసీ ఆజాద్ ఫెడరేషన్ నాయకులు







