
-యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు ఉంటుంది.
-యువకులు రాజకీయాలకు వచ్చి సమాజ సేవ చేయాలి.
-ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు.

జమ్మికుంట టౌన్: పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో హుజురాబాద్ కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది.వరుసగా బిఆర్ఎస్,బిజెపి పార్టీల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వీరికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ మాట్లాడుతూ సమాజంలో యువతకు రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు పెద్దపీట వేస్తుందని యువకులు రాజకీయాలకు ఆకర్షితులు సమాజం పట్ల సానుకూల దృక్పథంతో సేవ చేయడానికి ముందుకురావడం శుభపరిణామని,సేవ చేయడానికి ముందుకు వచ్చేవారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత వుంటుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించిందని అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజల పట్ల తమకున్న కమిట్మెంట్ ని చూపెట్టారని,హుజురాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి హుజురాబాద్ అభివృద్ధికి మా వంతు సహాయం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమములో చిన్నాల కార్తిక్,చిన్నాల శ్రీకాంత్,రాకేష్,వినయ్,రంజిత్,రమణ,వంశీ,సాయి కృష్ణ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు.