
జమ్మికుంట లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు పూర్తి ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టారని కేంద్రంలో బీజేపీ అవినీతి కార్పోరేట్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలని దీని కోసం రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర ద్వారా ఈరోజు మోడీ అమిత్ షా కార్పొరేట్ ఆదాని అంబానీల కుంభకోణాలను అవినీతి ని బయటపెడుతూ చేపడుతున్నారు దీనికి పెద్ద మొత్తంలో ప్రజలు స్వాగతం తెలియజేస్తున్నారు. గతంలో బిజెపి ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడిన మాటలను నిలబెట్టుకోలేదు పేదల అకౌంట్ లో 15 లక్షల ఇస్తానని మోడీ ఇంతవరకు దాని ఊసే లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం వస్తుందని బిజెపి కార్పొరేట్ పరిపాలన పోయి కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పరిపాలన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గుర్తు హస్తం కు ఓటు వేసి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకర రమేష్ సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, పొన్నగంటి మల్లయ్య, సలీం, సాయిని రవి, శ్రీనివాస్, సారంగపాణి, మహిళా అధ్యక్షురాలు రేణుక, కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట కౌన్సిలర్లు పట్టణానికి చెందిన వార్డు అధ్యక్షులు నాయకులు NSUI కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు