
–డంప్ యార్డ్ ప్రతిపాదన హుజూరాబాద్ నుండి వెనక్కి తీసుకోండి.
–వారంలో రెండోసారి ఈ విషయంపై చర్చ..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణ పరిధిలోని సిర్సపల్లి శివారులో నిర్మించ తలపెట్టిన డంప్ యార్డ్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ ని కలిసి దాని వల్ల వచ్చే అనర్థాలను, ఇతర ప్రాంతాలకు తరలిస్తే ప్రజలకు ఎంత ఉపయోగమో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వివరించారు. ఈ ప్రాంతం వ్యవసాయానికి మూలాధారమని ప్రజల మనోభావాలు అర్ధం చేసుకొని, ఈ వేస్ట్ టు ఎనర్జీ యార్డుతో జనాలతో పాటు, వాటి వ్యర్థాల వల్ల పంట పొలాలకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. జనావాసాల మధ్య కాకుండా వేరేచోటుకి దీన్ని మార్చాలని కోరారు. ఈ విషయమై ఇప్పటికే వారంలో రెండవ సారి కలిశామని దీనిపై ఎలాంటి ముందుకు వెళ్లొద్దని, సీఎం దృష్టికి ఈ విషయం తెలపాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈ విషయమై చర్చిస్తామని భరోసా కల్పించారన్నారు.

ప్రభుత్వ సలహాదారును నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేస్తున్న కాంగ్రేస్ నేత ప్రణవ్..





