Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అభివృద్ధి పేరిట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తారా అంటూ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు మాట్లాడుతూ….అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప అభివృద్ధి పేరిట ప్రజలకు నష్టం కలిగించే పనులకు పూనుకోవడం మంచిది కాదన్నారు. హుజురాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డ్ వల్ల జల, వాయు, నీటి కాలుష్యం జరిగి ప్రజలకు తీవ్ర నష్టాలు ఉన్నాయన్నారు. కాలుష్యం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడతారని, సీడ్ బౌల్ గా పేరుందిన హుజురాబాద్ ప్రాంతం కాలుష్యం వల్ల పూర్తిగా నష్టపోతుందన్నారు. సామాజిక బాధ్యతగా జర్నలిస్టులు సైతం దీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో జర్నలిస్టులు తమ వంతు బాధ్యతగా పాల్పంచుకుంటున్నామని పలువురు జర్నలిస్టులు అన్నారు. జర్నలిస్టుల నిరసన దీక్షకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబులు వేర్వేరుగా వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బాధితులు, రైతులు, యువత పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కామని రవీందర్, సీనియర్ పాత్రికేయులు కోరం సుధాకర్ రెడ్డి, పరాంకుశం కిరణ్ కుమార్, గడ్డం ధర్మారెడ్డి, మక్సుద్, మండల యాదగిరి, నంబి భరణి కుమార్, కేదాసి శ్రీధర్, చిలకమారి సత్యరాజ్, పబ్బ తిరుపతి, కే నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, ముష్క శ్రీనివాస్, ఫహిం, ఎడ్ల కుమార్, కేశబోయిన స్వామి, టి సాగర్, పడాల రమేష్, మచ్చిక చందు, వి గోపాల్ రావు, రాజు, బాబు, శ్రీనివాస్, ఇమ్రాన్, జేఏసీ నాయకులు పీ ఈశ్వర్ రెడ్డి, జీ జైపాల్ రెడ్డి, రత్నం, ఏ కొండల్ రెడ్డి, పీ రామారావు, జనార్ధన్, కవి నాగుల సత్యంగౌడ్, సమ్మయ్య, లక్ష్మణమూర్తి పాల్గొన్నారు. అనంతరం తహసిల్దార్ నరేందర్ కు వినతి పత్రం అందజేశారు.


ఒకరోజు దీక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు.. తాసిల్దార్ కు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు, జేఏసి, వివిధ సంఘాల నాయకులు..


మాట్లాడుతున్న సీనియర్ జర్నలిస్ట్, స్వర్ణోదయం ప్రతినిధి మండల యాదగిరి..





