Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 16 మంది విద్యార్థులు నగదు బహుమతులను సాధించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కందుకూరి శంకర్, ఉపాధి కల్పనా శిక్షణాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. ఇటీవల తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థ (టాస్క్) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ సింహా, టాస్క్ జిల్లా మేనేజర్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో హెడ్ హెల్డ్ హై అనే సంస్థ, ఎస్ బ్యాంక్ సౌజన్యంతో సామాజిక ఆవిష్కరణలు సరళమైన జీవితం ‘ అనే అంశంపై సదస్సు నిర్వహించారన్నారు. ఈ సదస్సుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు 100 బృందాలుగా ఏర్పడ్డారన్నారు. వారు పలు సామాజిక అంశాలను ఎంపిక చేసుకొని వాటికి పరిష్కారాలను తెలిపే విధంగా పోస్టర్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారని తెలిపారు. ఇందులో మొత్తం 15 ప్రాజెక్టులను ఎంపిక చేయగా, కిట్స్ విద్యార్థులు తయారు చేసిన ఆరు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని పేర్కొన్నారు. సీఎస్సీ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న 16 మంది విద్యార్థులు వీటిని తయారు చేశారన్నారు. ప్రథమ బహుమతి కి ఇద్దరు ఎంపికవ్వగా ఒక్కొక్కరికి రూ. 15వేల చొప్పున నగదు, మిగిలిన 14 మంది విద్యార్థులకు ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను అందుకున్నారన్నారు. వీరికి రఘు, ప్రశాంత్ లు మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల చైర్మన్ లక్ష్మీకాంతరావు, కార్యదర్శి సతీష్ కుమార్, సీఎస్సీ విభాగాధిపతి డాక్టర్ మేజర్ రవీంద్రబాబు, రిజిస్ట్రార్ రాజేశ్వర్ రావు, అధ్యాపకులు అభినందించారు.

నగదు బహుమతులు కైవసం చేసుకున్న 16 మంది విద్యార్థులతో ప్రిన్సిపాల్ తదితరులు..




