
—రైతు మహాగర్జనకు రావాలని హుజురాబాద్ ఎం ఎల్ ఏ పాడి కౌశిక్ రెడ్డికి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలకు ప్రజాసంఘాల ఐకాస వినతి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ఎందుకు నిర్లక్ష్యం చూపుతుంది ?
అన్నదాతలకు విద్యార్థులకు వివిధ వర్గాల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రశ్నించారు.

ఈనెల 28న కరీంనగర్ లో రెండు లక్షల మందితో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభకు హాజరు కావాలని కోరుతూ ప్రజా సంఘాల ఐకాస నాయకులతో కలిసి సోమవారం హుజురాబాద్ ఎంఎల్ ఏ క్యాంప్ కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలకు జగిత్యాల లో జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిలకు పోలాడి రామారావు ఆహ్వాన పత్రికలను అందజేయగా సభకు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చి సభకు హుజురాబాద్ నియోజక వర్గ వ్యాప్తంగా రైతులు పెద్ద సంఖ్యలో రైతుల మహా గర్జన సమర భేరి సభకు హాజరు కావాలని కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేయగా జగిత్యాలలో జీవన్ రెడ్డి, పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డిలు భారీ ఎత్తున రైతులు పార్టీల కతీతంగా తరలి వచ్చి విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.



ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే పాలకులు రైతుల సంక్షేమంపై ఇచ్చిన హామీల అమలులో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది ? వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు ఎందుకు తగ్గాయి ? రెండు లక్షల రుణ మాఫీలో అర్హులైన మిగతా 70 శాతం రుణమాఫీ ఎందుకు పూర్తి చేయడం లేదు ? కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని నిలదీశారు.
ఇప్పటికే రెండు సార్లు ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను సర్కార్ ఎందుకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు ? అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని ఎందుకు కొంత మేరకు మాత్రమే ఇస్తున్నారు? విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు నిలిచి పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని పోలాడి ప్రశ్నించారు. నామ మాత్రంగానే ఓసి కార్పొరేషన్లు ప్రకటించిన ప్రభుత్వం వాటికి పాలక మండలి ఏర్పాటు చేయకుండా చట్ట బద్ధత కల్పించక నిదులు ఎందుకు కేటాయించలేదు? గతంలో ఉన్న పాల ఉత్పత్తి దారులకు లీటరుకు 4 రూపాయల రాయితీ ఎందుకు నిలిపి వేశారు? 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం ఎప్పుడు అని పోలాడి ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ సీడ్ కంపెనీల యాజమానుల ఆగడాలను ఎందుకు అరి కట్టడం లేదు? . ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల పంటలను పూర్తిగా ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదు? గ్రామీణ ప్రాంతాలలో కూలీల కొరత ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో ఉపాధి హామీ పథకం తో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తుంది?.
ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ?
యువతకు ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు!
ఆర్ధికంగా వెనుకబడిన ఓసి ల సంక్షేమం కోసం కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని పోలాడి రామారావు సూటిగా ప్రశ్నించారు.

ఈ డిమాండ్ల సాధనకోసం.
ఏప్రిల్ 28 న కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త రైతుల మహా గర్జన సమర భేరి సభను పార్టీల కతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 50 వేల మంది తరలి వస్తున్నారని సభకు 30 వేల మంది మహిళలలు 10 వేల మంది యువత తరలి వస్తున్నారని ఇతర జిల్లాల నుంచి లక్షకు పైగా స్వచ్ఛందంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు హాజరు కానున్నట్లు మొత్తంగా రెండు లక్షల మందికి తగ్గకుండా వస్తున్నారని మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్ నియోజక వర్గాల నుంచి 800 ట్రాక్టర్ల తో మిగతా వారు 1500 బస్సులో ఇతర వాహనాల ద్వారా సభకు రావడానికి ఎక్కడికక్కడ సమన్వయ కమిటీ తరపున శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తరలి వచ్చి మహాగర్జన సభను విజయవంతం చేయాలని పోలాడి రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజాసంఘాల రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు బైరెడ్డి రాంరెడ్డి, నలుమాసు ప్రభాకర్, మిర్యాల ప్రసాద్ రావు, గుడాల శ్రీనివాస్, పోరెడ్డి శంతన్ రెడ్డి, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, యెన్నం కిషన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జంగిలి సాగర్, ఇరుమళ్ళ సురేందర్ రెడ్డి, పోల్సాని రామారావు, ప్రతాప తిరుమలరెడ్డి, కొలిపాక సమ్మయ్య, మహంకాళి రాజన్న, సత్యనారాయణ, శీలం రాజేంద్రకుమార్, సంతోష్ రావు, కౌన్సిలర్లు గందే శ్రీనివాస్, కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి, ప్రతాప మంజుల కృష్ణ, నాయకులు కొండ్ర నరేష్, ముక్క రమేష్, గోవర్ధన్, అన్నాడి రవీందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలతో పాటు పలువురు సర్పంచులు, సింగిల్ విండో మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.





