
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ లో డంప్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జేఏసీ ఏర్పర్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో 24 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా తరలించేవరకు ఈ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుందని హెచ్చరించారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ డంపింగ్ యార్డు వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ
కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, మండల అధ్యక్షులు పారుపల్లి కొండల్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలరెడ్డి, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్, కౌన్సిలర్లు పంజాల మనోజ్, కోలుగురి సుమలత, తుర్పాటి లక్ష్మీదుర్గ, బిజెపి మాజీ మండల, పట్టణ అధ్యక్షులు రాముల కుమార్, గంగిశెట్టి రాజు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, దామర అనురాగ్ రోహిత్, మంచికట్ల మురళి, పడారి సుమన్, చైతన్యరెడ్డి, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, పెరుమళ్ళ దేవాగౌడ్, వాసాల చిరంజీవి, భాషబోయిన శ్రీనివాస్, మోడపు వినయ్, బైరెడ్డి సంపత్ రెడ్డి, పంజాల రాజేష్, యాంసాని శశిధర్, బోరగాల సారయ్య, గోవిందుల భాస్కర్, గంట సంపత్, గొట్టే రవీందర్, క్యాస వెంకటేష్, హుజురాబాద్ పట్టణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బిజేపి పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో 24 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టిన దృశ్యం..






