
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని కల్వరి టెంపుల్ రంగాపూర్ లో స్థానిక సంఘ కాపరి పాస్టర్ నెల్సన్ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఘనంగా ఈస్టర్ వేడుకలను నిర్వహించారు. ఈస్టర్ పర్వదినం అనగా గుడ్ ఫ్రైడే రోజు ఏసు క్రీస్తు మరణించి ఆదివారం తిరిగి లేచిన దినమును పునరుత్థాన ఈస్టర్ గా పిలుస్తారు. సభాధ్యక్షులుగా బండ రమేష్ చక్కగా నడిపించారు. ఈ వేడుకలకు ఉదయం నుండే క్రైస్తవులు నూతన వస్త్రాలతో మందిరానికి చేరుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హోసన్నా మినిస్ట్రీస్ నుండి రెవ D. రవీందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ల శేఖర్ హాజరయ్యారు. తన జీవితములో యేసయ్య చేసిన అద్భుతాలను శేఖర్ కన్నీటితో సాక్షమిచ్చారు. వారి సాక్ష్యం విన్న సంఘ సభ్యులు కంటతడితో దేవునిని మహిమపరిచారు. అనంతరం దైవజనులు రవీందర్ స్తుతి ఆరాధన ద్వారా అనేక కన్నీటి పాటలతో సంఘ సభ్యులను ఉత్సాహ పరిచి, చక్కని దైవ సందేశం అందించారు. అనంతరం సంఘ సభ్యులు బొడ్డు మొగిలి – పూల దంపతులు ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను ఫాదర్ నెల్సన్ – సుదిన దంపతులతో పాటు అతిథులు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.

గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ వరకు 40 రోజులు ఉపవాసము ఉన్న సందర్భంగా సభ్యులైన బండ రమేష్ -మాధవి దంపతులు హాజరైన ప్రతి ఒక్కరికి చక్కని ప్రేమ విందును ఏర్పాటు చేశారు. గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫాదర్ నెల్సన్ సుదిన దంపతులను, అతిధులను, కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారికి, విద్యార్ధిగా ఉండి 40 రోజులు ఉపవాసము ఉన్న బొడ్డు కిరణ్ తేజ్ తో సహా ఘనంగా సన్మానం చేశారు. అనంతరం దైవజనులు అందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీర్వాదాలను అందించి ముగించారు.





మాట్లాడుతున్న సంఘ కాపరి పాస్టర్ నెల్సన్








