
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జనావాసాల మధ్య ఎలాంటి ప్రజాబిప్రాయ సేకరణ చేపట్టకుండా హుజురాబాద్ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్సఫర్ (D B F O T) సిస్టమ్ లో రాంకీ అనే ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి ప్రభుత్వం చేపట్టిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి వేలాది మందితో కలిసి హుజురాబాద్ లో చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను బుధవారం మహిళలతో కలిసి రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఎంఎల్ ఏ పాడి కౌశిక్ రెడ్డికి పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. గత 17 రోజులుగా విభిన్న రూపాల్లో ప్రజలు చేస్తున్న ఆందోళనలతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే డంపింగ్ యార్డును రద్దు చేస్తూ వారంలోగా అధికార ప్రకటన చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణా తరహాలో ఉద్యమం ఉదృతం చేస్తామని, ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరాహార దీక్షను విరమింప చేస్తున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..






