
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ రద్దుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు.

బుధవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ…. ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో హుజురాబాద్ మున్సిపాలిటీ మొదటి తీర్మానం డంపింగ్ యార్డ్ రద్దునే చేశామని తెలిపారు. హుజురాబాద్ ఇన్చార్జి ప్రణవ్ బాబు సహకారంతో దీని రద్దు కోసం తాము ఆయన వెంట ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి, ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రాకు డంపింగ్ యార్డ్ విషయంలో ప్రణవ్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు. ప్రజలకు నష్టం కలిగించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రద్దు పరిచే వరకు తాము జెఎసి ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. దీక్షలతో పని కాదని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తేనే డంపింగ్ యార్డ్ రద్దు అవుతుందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కౌన్సిలర్లు చందమల్ల పుణ్య, కోయల్ కార్ భారతి, గోస్కుల రాజ్ కుమార్, ఎండి కాలిక్ హుస్సేన్, ఇల్లందుల సమ్మయ్య, నాంపల్లి శ్రీనివాస్, జే భాస్కర్, నాయకులు మేకల తిరుపతి, సందమల్ల బాబు, గోస్కుల మధు తదితరులు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని





