
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎంజెపి కేసి క్యాంప్ హుజురాబాద్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినిలు సబ్ జూనియర్ కేటగిరీలో జి నివేదిత, జి మహేశ్వరి, ఎన్ లాస్య, డి మాన్యత, జి కీర్తన, జూనియర్ కేటగిరిలో టి అక్షయ, ఎం సౌమ్యశ్రీ, సిహెచ్ అక్షయ, యు అక్షిత, వి శ్రీవిద్యలు రాష్ట్రస్థాయిలో అత్యధిక ప్రతిభ కనబరిచి టచ్ రబ్బి జాతీయస్థాయికి ఎంపికయ్యారని పాఠశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ తాళ్లపల్లి శారద, ఏటీపీ పోగు రజిత, పిఈటి చిరుత కవితలు మరియు విద్యార్థినులను అభినందించారు. వీరు 10/ 4 /2026 నుండి 12/ 4 /2026 వరకు జరగబోయే జమ్మూ & కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్నారని వారు తెలిపారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులతో పాఠశాల ప్రిన్సిపల్, పిఈటి తదితరులు..





