Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల జరిగిన హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 45 మంది అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను అందించలేదని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎం మనోహర్ తెలిపారు. గురువారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…. గత మున్సిపల్ ఎన్నికల్లో 143 మంది అభ్యర్థులు కౌన్సిలర్లుగా పోటీ చేశారని అన్నారు. వారు ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలను మార్చి 29 తేదీలోగా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎండి జలాలుద్దీన్ అక్బర్ కు అందించాల్సి ఉందని కానీ చివరి తేదీ ముగిసే వరకు కేవలం 98 మంది మాత్రమే తమ ఎన్నికల ఖర్చుల వివరాలను అధికారులకు అందించారని అన్నారు. ఖర్చుల వివరాలు అందించని 45 మంది అభ్యర్థులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఖర్చుల వివరాల గురించి ఎన్నికల సంఘానికి నివేదించామని ఆ నివేదికను మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ కు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ ఎండి జల్లాలోద్దీన్ అక్బర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ఖర్చుల వివరాల నివేదిక అందించనీ వారి వివరాలను మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ కు అందిస్తున్న జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎం మనోహర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు





