
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని 15వ వార్డుకు చెందిన మార్త రవీందర్ గృహ సమీపంలో ఇటీవల హుజురాబాద్ మునిసిపల్ కో ఆప్షన్ మెంబర్‌గా ఎన్నికైన రిటైర్డ్ ఎంఈఓ గొట్టే జమదగ్ని కీ హుజురాబాద్ 15వ వార్డుకు చెందిన వివిధ వర్గాల వారు ఆయనను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కొండ గణేష్ అధ్యక్షత వహించగా 15వ వార్డుకు సంబంధించి టీచర్స్, ఎంప్లాయిస్, ఆర్టీసీ ఎంప్లాయిస్ మిగతా శ్రేయోభిలాషులు జమదగ్నికి శాలువాలు కప్పి, పూల మాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు. జమదగ్ని భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించారని ఈ సందర్భంగా పలువురు అభిలాషించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మార్త రవీందర్, ఆలేటి లక్ష్మణ్, చెల్లెల మల్లారెడ్డి, పోరెడ్డి సమ్మిరెడ్డి, ఆడెపు రవీందర్, పోలు రాజయ్య, నాగిరెడ్డి శ్రీనివాసరావు, ఓరుగంటి రాజురెడ్డి, గడిపే సహోదరు, ముత్తిరెడ్డి జైపాల్ రెడ్డి, అరిగెల శ్రీనివాస్, కాసర్ల అనిల్, వడ్లకొండ కిరణ్ కుమార్, కె సుధాకర్, సబ్బని సదానందం, ఎడ్ల లింగారెడ్డి, దొమ్మాటి సుధాకర్, రాంపల్లి బిక్షపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జమదగ్నినీ సన్మానించారు.

కో ఆప్షన్ మెంబెర్‌గా ఎన్నికైన గొట్టే జమదగ్నిని సన్మానిస్తున్న 15వ వార్డు ప్రజలు, అభిమానులు..









