
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వేసవికాలంలో ఎండలు మండిపోతుండడంతో హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని 19వ వార్డ్ కౌన్సిలర్ గోస్కుల రాజ్ కుమార్ వార్డు ప్రజల కోసం డిప్యూటీ డిఎంహెచ్వో శ్రవణ్ ను సంప్రదించి ఓఆర్ఎస్ ల పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు ఎండ వేడి నుంచి తట్టుకునేలా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉపయోగించుకోవాలని అన్నారు. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్లో ఈ పౌడర్ కలుపుకొని తీసుకు వెళ్తే ఎండ వేడిమి నుంచి శరీరం అలసట కాకుండా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె దావకాన డా. జరీనా, హెల్త్ అసిస్టెంట్ సత్యం, ఆశా వర్కర్ శారద తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న వైద్యురాలు జరీన, వైద్య సిబ్బంది








