Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి.కిషన్ ని నియమిస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 35 మంది కమిషనర్ల బదిలీల్లో భాగంగా ఈ మార్పు జరిగింది. ప్రస్తుతం
సెక్రటేరియట్లోని ఎల్ అండ్ టి విభాగంలో సెక్షన్
ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న బి. కిషన్ ను
హుజరాబాద్ కమిషనర్ గా నియమించారు. ఇక్కడ
పని చేసిన కమిషనర్ ముసబ్ అహ్మద్ ను బదిలీ చేస్తూ, సీడీఎంఏ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ముసబ్అహ్మద్ ఇక్కడ బాధ్యతలు చేపట్టి కేవలం మూడు నెలలు కాగా మున్సిపల్ ఎన్నికల్లో నిధుల వినియోగంలో అవకతవకలు జరిగింది, ఏఈ ఏసీబీ కి దొరకడం ఈ కమిషనర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగడం గమనార్హం. కాగా నూతన కమిషనర్ కిషన్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిసింది.





