
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే01: వేసవిలో నిర్వహించే హాకీ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బుడిగే తిరుపతిగౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులకు హాకీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని క్రీడాకారులు వేసవి శిక్ష శిబిరం ద్వారా మెలకువలు నేర్చుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుందని తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో హాకీ నేర్చుకునే క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు గుడ్డెలుగుల సమ్మయ్య, వేముల రవికుమార్, శ్యాంసుందర్, సజ్జు, యూసుఫ్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాజు, రాజేష్, సాయికృష్ణ, కోచ్ విక్రమ్, సాంబరాజు, వినయ్, వంశీతోపాటు సీనియర్, జూనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.







