Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనీ క్యాస రమేష్ కిరాణా దుకాణo లో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేసి పిడిఎస్ బియ్యంను పట్టుకున్నారని హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ తెలిపారు. పిడిఎస్ బియ్యాన్ని కిరాణా దుకాణంలో కలిగి ఉన్నట్లు సమాచారం రావడంతో ఆ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా ఐదున్నర క్వింటాల పిడిఎస్ బియ్యం లభించాయని, ఆ బియ్యాన్ని సివిల్ సప్లై శాఖకు అప్పగించి వ్యాపారిపై 6ఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇల్లందుల వినోద్, పలువురు పోలీసులు పాల్గొన్నారు.

క్యాస రమేష్ దుకాణంలో పట్టుబడిన రేషన్ బియ్యం తో సివిల్ సప్లై ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్, పోలీసులు..





