Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, మే 16: మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో కుటుంబ సభ్యులు అతడిని పోలీసులకు అప్పగించారు. భగీరథ్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. చట్టంపై గౌరవంతోనే తన కుమారుడిని విచారణ కోసం పోలీసులకు అప్పగించామని బండి సంజయ్ తెలిపారు. ‘చట్టం ముందు అందరూ సమానమే’ అని ఆయన పేర్కొన్నారు.

పోలీసుల ఎదుట లోగిలిపోయిన బండి భగీరథ సాయి (ఫైల్ ఫోటో)






