
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఒకే పంటను కాకుండా పంట మార్పిడి చేయడం ద్వారా రైతు ఆదాయంలో పెంపు అవుతుందని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంకో ఆర్డినేటర్ డాక్టర్ హరికృష్ణ అన్నారు.

సోమవారం హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మేలైన సాగు పద్దతులపై అవగాహన కలిగి ఉండాలని, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం కావాలన్నారు. తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చుని తగ్గించండి, అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. చెట్లను పెంచండం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలన్నారు.


విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలు, సాగు నీటిని ఆదా చేయండి భావి తరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సమ్మిరెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ సతీష్, కాలనీ గ్రామ ఉప సర్పంచ్ రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారిని అనూష, కృషి విజ్ఞాన కేంద్రం, సిబ్బంది . మౌనిక రైతులు తదితరులు పాల్గొన్నారు.





