Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ఆవులను, ఆవు దూడలను కుర్బానీ ఇవ్వకూడదనీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మస్జిద్ ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ…
ఆవులను ఎవరైనా సరఫరా చేసినట్లయితే కఠినమైన చర్యలు ఉంటాయనీ, అలాంటి వ్యక్తులపై కూడా పోలీస్ కేసు నమోదు చేయడం జరుగుతుంది హెచ్చరించారు ఉమ్మడి జిల్లాలలో బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో ముస్లిం సోదరులు జరుపుకోవాలని అన్నారు. ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పండుగకు మేకపోతు గొర్రెపోతు దున్నపోతులను కుర్బాని ఇవ్వాలని అన్నారు.

మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్





