Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ, మండల పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బిజెపి ఆధ్వర్యంలో హుజురాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ కి వినతిపత్రం సమర్పించారు.

మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని, బి కేటగిరి పేరుతో సాగుతున్న దోపిడిని అరికట్టాలని, వర్ష సూచన ఉన్నందున కొనుగోళ్లను పూర్తి చేయాలని బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లేక, సకాలంలో లారీల రవాణా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే నిరీక్షించాల్సి వస్తోందని మండిపడ్డారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే సేకరించాలన్నారు. రవాణా సౌకర్యం మిల్లులకు ధాన్యం తరలించడానికి తగినన్ని ఏర్పాటు చేయాలన్నారు. కట్టింగ్ నిలిపివేత తూకంలో తరుగు (కట్టింగ్) పేరిట రైతులను నష్టపరచడాన్ని వెంటనే ఆపాలన్నారు. సకాలంలో చెల్లింపులు చేయాలన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు నిబంధనల ప్రకారం వెంటనే డబ్బులు ఖాతాల్లో జమ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గసభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, అంకతి వాసు, తిప్పబత్తిని రాజు, బోరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్, మోటపోతుల రాకేష్, బొడిగె రాదా, క్యాస వెంకటేష్, నల్ల అజయ్, నీలం రవీందర్, కొత్తకొండ ఉమాశంకర్, డోరి ఐలయ్య, వీరస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





