
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) మే 20 : దేశవ్యాప్తంగా All India Organisation of Chemists and Druggists (AIOCD) ఆదేశాల మేరకు (మే 20న) నేడు నిర్వహించిన ఆల్ ఇండియా కెమిస్టుల బంద్ జమ్మికుంటలో విజయవంతంగా జరిగింది.

ఆన్లైన్ ద్వారా విచ్చలవిడిగా మందులు అమ్మడం, మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువత చెడు ప్రభావాలకు గురవుతున్నారని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆన్లైన్లో నకిలీ మందులు విక్రయాలు పెరుగుతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వ దృష్టి ఆకర్షించేందుకు ఒకరోజు బంద్‌కు పిలుపు నిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్మికుంట కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని మెడికల్ షాపులు సహకరించాయి. ఈ బంద్ విజయవంతం కావడానికి సహకరించిన జమ్మికుంట కెమిస్ట్రీ సోదరులందరికీ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పైడిమర్రి వెంకటేశ్వర్లు, కె.ఆర్.వి. నరసయ్య, వెంకన్న, భాస్కర్ లింగం, శ్యామ్ కిషోర్, రమేష్, దేవేందర్, సత్యం, ప్రసాద్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.





