
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి షాపులో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయాలని డిసిపి వెంకటరమణ సూచించారు. ఇటీవల దొంగతనాలు ఎక్కువగా కావడంతో మంగళవారం హుజురాబాద్ లోని పలు బంగారు షాపుల్లో సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. షాపులోకి వచ్చిన వారి వద్ద విధిగా ఆధార్ కార్డు తీసుకోవాలని అన్నారు. అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని అన్నారు. అపరిచిత వ్యక్తులకు కిరాయి ఇచ్చేవారు వారికి సంబంధించిన ఐడెంటి కార్డులు తీసుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. షాపులు మూసే సమయంలో ఒకటికి రెండుసార్లు తాళం సరి చూసుకోవాలన్నారు. అనుమానితులు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసిపి మాధవి, సీఐ కరుణాకర్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



పట్టణంలో జ్యువెలరీ షాప్ ను పరిశీలిస్తున్న డిసిపి వెంకటరమణ, ఏసీపీ మాధవి, టౌన్ సిఐ తదితరులు..





