
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పేషేంట్ల మంచి చేడులు తెలుసుకొని వారికి ఆరటి పండ్లు పంపిణీ చేశారు. భారతదేశానికి ప్రధానిగా రాజీవ్ గాంధీ అందించిన సేవలను వారు కొనియాడారు. యువతరంకు రాజకీయాలలో అధిక ప్రాధాన్యత కల్పించి శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచడంలో రాజీవ్ గాంధీ సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మహిళా విభాగం మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, జిల్లా కార్యదర్శులు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, జిల్లా మహిళా నేతలు, కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు పలువురు కాంగ్రెస్ నేతలు

రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేతలు..





