Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డుకు చెందిన టేకుల రాజు అనే ట్రాక్టర్ డ్రైవర్ నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వడదెబ్బతో మృతి చెందినట్లు అవార్డు కౌన్సిలర్ చందమల్ల పుణ్య- బాబు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా వెళ్లి కూడా దెబ్బ బారిన పడి తీవ్ర స్వస్థత గురికాగా కుటుంబ సభ్యులు తీసుకువెళ్తామనే లోపే మృతి చెందాడన్నారు. మృతుడికి భార్య శైలజ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయినా రాజు మృతితో అతని కుటుంబం వీధిన పడింది. కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో చుట్టుపక్కల వారు బంధువులు చందాలు పోగుచేసుకొని అంత్యక్రియలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కౌన్సిలర్ దంపతులు పుణ్య- బాబు విజ్ఞప్తి చేశారు.

వడదెబ్బతో మృతి చెందిన టేకుల రాజు (45)





