
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల్లో శారీరత మానసిక ఆరోగ్యం పట్ల మరింత అవగాహన పెరగాలని ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమం రూపకల్పన చేశారు.



ఇందులో భాగంగా యోగా, కరాటే, జుంబా నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగాలో కరాటేలో మున్సిపల్ చైర్మన్ ప్రత్యక్షంగా పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ….నేటి ఆధునిక యుగంలో మనిషికి తమ కుటుంబం గురించి గానీ ఆరోగ్యం గురించి గానీ పట్టించుకునే సమయం ఉండడం లేదని అంటున్నారు. కానీ మనిషి మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటుందని విషయం ఆలస్యంగా తెలుసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా కరాటే, యోగా, జుంబా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి కిషన్, కౌన్సిలర్లు ఇల్లందుల సమ్మయ్య, బోరగాల మొగిలి, సొల్లు సునీత, నాంపల్లి శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, యోగ గురువు తాళ్లపల్లి రమేష్ గౌడ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎండి మతిన్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, సుశీల, బాలాజీ, ఇతర ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.






